ఇప్పు పువ్వు కోసం వెళ్తే.. గిరిజన యువతిని రేప్ చేసిన అటవీ అధికారులు..

Subscribe to Oneindia Telugu

తాడ్వాయి: అమాయక గిరిజన మహిళల పట్ల మదమెక్కిన అటవీశాఖ అధికారులు కామంతో రెచ్చిపోయారు. ఇప్ప పువ్వు కోసం వెళ్లిన ఓ మహిళను వేధించి..వెంబడించి అపహరించారు. ఆపై సదరు గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గొత్తి కోయగూడాలకు చెందిన సోడి సోమిడి(17), సోడి బీమమ్మ(22), దూలమ్మ(22) అనే ముగ్గురు గిరిజన యువతులు ఇప్ప పువ్వు కోసం ముసలమ్మ పెంట సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ బేస్ క్యాంప్ అధికారులు సంతోశ్, విజయ్‌ల కన్ను దూలమ్మపై పడింది.

forest base camp officers raped a woman in bhupalapalle

ఆ ముగ్గురిని వెంబడించి దూలమ్మను అక్కడినుంచి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. మిగతా ఇద్దరు గట్టిగా ప్రతిఘటించడంతో తీవ్ర పెనుగులాట జరిగింది. చివరకు దూలమ్మను అపహరించిన ఫారెస్టు అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటికే మిగతా ఇద్దరు గ్రామ పెద్దలకు సమాచారం అందించడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two forest base camp officers raped a tribal woman in Bhupalapalle district. The victim was filed a case against them
Please Wait while comments are loading...