వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటవీ సిబ్బంది అత్యుత్సాహం: మహిళలను చెట్టుకు కట్టేసి.. గుడిసెలను తగలబెట్టి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ అధికారులు అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారనే కారణంతో గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి, వారి గుడిసెలు తగులబెట్టారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని అటవీ అధికారులు అనాగరిక చర్యలకు పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారన్న కారణంతో గుడిసెలను తగులబెట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మహిళలను చెట్లకు కట్టేసి గుడిసెలను తగులబెట్టారు.

గోవిందరావుపేట మండలం పస్రా అటవీ రేంజ్ పరిధిలోని జలగలంచ అడవుల్లో చత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అయితే... అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారన్న కారణంతో అటవీ సిబ్బంది శనివారం అక్కడకు వెళ్లి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు.

Forest Staff Overcharge: They set Tribal huts on Fire by tying up Tribal Women to a Tree

ఆ సమయంలో తమ గుడిసెలను తొలగించవద్దంటూ గొత్తికోయల మహిళలు అడ్డుకున్నా వినిపించుకోకుండా కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గొత్తికోయల మహిళలను చెట్టుకు కట్టేసి గుడిసెలను తగులబెట్టారు.

అటవీ అధికారులు ఈ తరహా చర్యలకు పాల్పడడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే సదరు అటవీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Forest Rangers attacked on tribes who came from chattisgarh and arranged huts to live at jalagancha forests of pasra forest range, govindarao pet mandal of Jayashankar Bhupalpally District on Saturday. When tribal women protest.. officials tied up them to a tree and their huts put on fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X