పాకిస్థాన్ గింతంత దేశం.. తీసి గట్టిగ కొడితే: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత్ ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు. ఇక పాకిస్థాన్ పై రివెంజ్ తీసుకోవాలని సోషల్ మీడియా శివాలెత్తుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత చోటుకున్నాయి.
పాకిస్థాన్ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పదేళ్ల క్రితమే ఆయన పాకిస్థాన్ బుద్ధిని గ్రహించారు. ఆ దేశంపై మండిపడుతూ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆ వీడియో ఒక్కసారిగా బయటకు వచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. కేసీఆర్.. గతంలో సీఎంగా ఉన్నప్పుడు పదేళ్ల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన మాటలివి.

'పాకిస్తాన్ దేశం భౌగోళికంగా, సైన్యం పరంగా మన దేశం కన్నా చాలా చిన్నది.. కశ్మీర్ లో ఎప్పుడు ఏదో గొడవ పెడతా ఉంటది.. మనం ఎక్కడ.. మన సంఖ్య ఎక్కడ.. రోజూ ఏదో గొడవ చేస్తా ఉంటాది. బోర్డర్ లో సైనికులను చంపుడు. ఇది దేశ సమస్య. రక్షణ సమస్య. మేము సపోర్ట్ చేస్తాం. అయినా కేంద్రం వెనకడుగు వేస్తోంది. భారత్ తలచుకుంటే పాకిస్తాన్ పని క్షణంలో పూర్తవుతుందని' అప్పట్లో కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం పాకిస్థాన్ పై చూసీచూడనట్లు వ్యవహరిస్తుందని ఈ మేరకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పహల్గాం ఉగ్రదాడి వేళ.. వైరల్ అవుతున్న కేసీఆర్ పాత వీడియో
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 25, 2025
ఆ పాకిస్తాన్ ఓ చిన్న దేశం.. తీసి గట్టిగా కొడితే అడ్రస్ లేకుండా పోతుంది
అలాంటి దేశంతో పగులూ-రాత్రి గుంజుడు కార్యక్రమాలు పెట్టుకున్నారు
కశ్మీర్ గొడవ తెగట్లేదు కానీ, జవాన్లు చనిపోతున్నారంటూ అసెంబ్లీలో స్పీచ్#KCR pic.twitter.com/2zgAvdPNq9
ఇక పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు,అధికారులు తగ్గింపు,సార్క్ దేశాల వీసా రద్దు,అటారీ-వాఘా బోర్డర్ మూసివేత, ఎక్స్‌ర్ సైజ్ ఆక్రమన్.. తదితర చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications