Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెటిఆర్‌ను ఆకాశానికెత్తిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్: తన ఫ్లెక్సీలు వద్దన్న మంత్రి

తెలంగాణ మంత్రి కెటి రామారావును మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలతో ముంచెత్తారు. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ ఆయన అన్నారు.

వరంగల్: తెలంగాణ మంత్రి కెటి రామారావును మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలతో ముంచెత్తారు. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ ఆయన అన్నారు. శనివారం వరంగల్ నిట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిసి ప్రారంభించారు. టాస్క్.. నాలుగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అమ్రపాలి, టాస్క్ చైర్మన్, ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మేయర్ నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు

రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు బాగున్నాయని కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. విద్యార్ధుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే లక్ష్యమని, కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అని, ఆయన కెప్టెన్సీలో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నారు. విద్యార్ధులు కోహ్లి, ధోనీలా ఎదగాలంటే లక్ష్యం కోసం కష్టపడాలని ఆయన అన్నారు.

ధీటుగా ఎదుర్కోవాలి...

ధీటుగా ఎదుర్కోవాలి...

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధీటుగా ఎదుర్కోవాలని కెటిఆర్ యువతకు సూచించారు. సమస్యలను ధీటుగా ఎదుర్కోవడమే అసలైన సవాల్ అని చెప్పారు. జీవితంలో రాణించాలంటే మానసికంగా, ధృఢంగా ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించగలమని స్పష్టం చేశారు. చదువుకునే సమయంలోనే అన్ని రక్షాల శిక్షణ పొందితేనే జీవితంలో రాణిస్తామని విద్యార్థులకు సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసే నాడు అన్నింటికీ సిద్ధపడాలని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. సమ్యలను ఎదుర్కోనేందుకు టాస్క్ లో నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు.

త్వరలోనే ఐటి పార్కు...

త్వరలోనే ఐటి పార్కు...

త్వరలోనే వరంగల్‌లో ఐటీ పార్క్, టెక్స్‌టైల్స్ పార్క్‌ను నెలకొల్పుతున్నామని కెటిఆర్ తెలిపారు. త్వరలో మడికొండలో రూ. 25 కోట్లతో ఐటీ టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టాస్క్ సేవలను వరంగల్ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ - వరంగల్ ఇండస్ర్టీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ యువతకు ఇక్కడే ఉపాధి లభించేలా తయారు కావాలని కేటీఆర్ సూచించారు.

కడియం ఇలా...

కడియం ఇలా...

వరంగల్‌లో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ మినిస్టర్ కేటీఆర్ కలిసి ప్రారంభించారు. వరంగల్ విద్యార్థులు చాలా ప్రతిభావంతులని, వీరికి అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని కడియం శ్రీహరి అన్నారు. ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ విస్తరించి.. పక్కనే ఐటీ టవర్స్ నిర్మించాలని కేటీఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లో ఐటీ పార్క్ విస్తరిస్తే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. టాస్క్ ప్రారంభం సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం, కేటీఆర్ సమక్షంలో నాలుగు కంపెనీలతో అధికారులు ఎంవోయూ కుదుర్చుకున్నారు.

నా ఫ్లెక్సీలు తీసేయండి...

నా ఫ్లెక్సీలు తీసేయండి...

నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని కెటిఆర్ అంతకు ముందు ట్విటర్ వేదికగా తేల్చిచెప్పారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో పలుచోట్ల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఓ నెటిజన్ ఫ్లెక్సీలను నిషేధించడం అధికార పార్టీకి వర్తించదా? అని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ... అలాంటి మినహాయింపులు ఏమీ ఉండవని రీ ట్వీట్ చేశారు. వెంటనే ఫ్లెక్సీలను తొలిగించాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+