Somesh Kumar: ఇదేందయ్యా సోమేష్.. 25 ఎకరాలు.. ఎకర రూ.3 కోట్లు.. !
తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గుర్తున్నాడా.. ఆయన్ను ఏపీకి కేటాయిస్తే తెలంగాణలోనే ఉండి సీఎస్ గా పని చేశారు. ఏపీ క్యాడర్ వెళ్లాలని తేల్చిచెప్పడంతో అక్కడి వెళ్లి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన గురించి ఇప్పుడేందుకు అంటారా.. ఇప్పుడు ఆయన భార్య సంబంధించిన ఓ విషయం సంచలనం రేపుతోంది. సోమేష్ కుమార్ భార్య డాగ్యన్ముద్రకు రంగారెడ్డి జిల్లా స్థలం ఉంది.
ఎకరామో రెండేకరాలో కాదు.. ఏకంగా 25 ఎకరాలు ఉంది. యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకర భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ రూ.75 కోట్లు. అయితే ఈ భూమి ఎలా వచ్చిందో తెలియడం లేదు. డాగ్యన్ముద్రకు ఖాతా నం.5237లో సర్వే నం.249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాలు, 260/అ/1/1 లో 7.19 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం కలిపితే 25.19 ఎకరాలుగా ఉంది. ధరణి పోర్టల్ లో ఖాతా నంబర్ కూడా ఉంది.

ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వార కొనలేదు. సాదాబైనామా ద్వారా భూమి కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదని సమాచారం. దీంతో ఈ భూమి అక్రమంగా వచ్చిందంటూ ఆరోపణలు వస్తున్నాయి.
లంచాలు, భూములతో అక్రమ సందించిన రెరా సెక్రెటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో సోమేష్ కుమార్ ఛైర్మన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడే యాచారంలో 25 ఎకరాలు సోమేష్ భార్య పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ భూమికి సంబంధి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేసినట్లు సోమేష్ కుమార్ చెబతున్నారు. తనకున్న ఇళ్లు అమ్మి స్థలం కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ జరగాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications