BRS: బీఆర్ఎస్ కు మరో షాక్.. పార్టీ మారబోతున్న కీలక నేత.. !

అసెంబ్లీ ఎన్నికలతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఆ పార్టీ పని అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీన వీడారు. తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలె యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాస రెడ్డి హస్తం గూటికి చేరారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నాట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూ పార్టీ మారొద్దని కోరుతున్నారు. అయినప్పటికీ కొంత మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో కీలక నేతగా ఉన్న ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్‌తో ప్రాథమిక చర్చలు జరిపారని.. ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Former Minister and Maheshwaram MLA Sabitha Indra Reddy is being promoted to join the Congress

ఆ ఎమ్మెల్యే ఇటీవల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పలు వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిధి మీ కోసం హేం శాఖ, విద్య శాఖలు ఖాళీ ఉంచారనుకుంటా అని అడిగారు. దీనికి ఆ ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేదు.. మంత్రి పదవి ఎలా సాధ్యమని సమాధానం చెప్పుకుండా అదృష్టమని చెప్పారంటే..ఆ ఎమ్మెల్యే పార్టీ మారే యోచనలో ఉన్నట్లు కనిపిస్తుందని సోషల్ మీడియాలో కామెట్లు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్పలేదు. కదూ.. ఆమె ఎవరో కాదు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ఆమె రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా పని చేశారు. 2019లో బీఆరెస్ చేరారు. బీఆర్ఎస్ చేరగానే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, అతడికి నామినేటెడ్ పోస్టును సైతం కాంగ్రెస్ ఆఫర్ చేసిందనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం, పట్లోళ్ల ఫ్యామిలీలదే ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం పట్నం కుటంబం కాంగ్రెస్ లో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+