KTR: మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేటీఆర్..
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. మేడిపల్లి సంత్యం భార్య ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశికే రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సత్యంను పరామర్శించారు. కేటీఆర్ సత్యం భార్య రూపాదేవి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మనోధైర్యంతో ఉండాలన్నారు.
అంతకు ముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మేడిపల్లి సత్యంను పరామర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కలిసిన బండి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య మరణంతో కుంగిపోయిన మేడిపల్లికి బండి ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మరణించడం బాధాకరమని చెప్పారు. జూన్ 23న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
— BRS Party (@BRSparty) June 26, 2024
సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అల్వాల్ లోని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకొని… pic.twitter.com/KAtta0BU2v
అల్వాల్ లోని పంచశీల కాలనీలో గల నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ సత్యంను పలకరించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. అనంతరం ఎక్స్ వేదికగా.. "భార్యావియోగంతో దుఃఖంలో ఉన్న సోదరుడు, శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం, ఆయన కుటుంబ సభ్యులను కొంపల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించాను. సత్యం భార్య రుపాదేవి అకాల మరణం చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ ఇతరులు కూడా మేడిపల్లి సత్యంను పరామర్శించారు.












Click it and Unblock the Notifications