Mallareddy: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన మల్లారెడ్డి.. !

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. మల్లారెడ్డి, ఆయన తనయుడు డీకే శివకుమార్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కాంగ్రెస్ చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందుకే డీకే శివకుమార్ ను కలిసినట్లు తెలుస్తోంది. గురువారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే భద్రచలం ఎమ్మెల్యే వెంకట్ రావు కాంగ్రెస్ తోనే ఉంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కూడా పార్టీ మారుతుండడంతో బీఆర్ఎస్ పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. బీబీ పాటిల్, రాములు బీజేపీలో చేరారు.

Former minister Mallareddy is ready to join Congress

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. బొంతు రామ్మోహన్ హస్తం గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లేదా.. బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ లోకి ఎవరూ రావడం లేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నైరశ్యంలో ఉన్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయని ప్రచారం జరగడంతో కారు పార్టీ సైడ్ అయి పోవాల్సి వస్తోంది. దీంతో బీఆర్ఎస్ లో చేరేందుకు ఎవరు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

అటు మాజీ ఆరూరి రమేష్ కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వడంతో తన దారి తను చూసుకునే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇక ద్వితీయశ్రేణి నాయకులు ముకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+