డీజే టిల్లు కాదు.. మన మల్లన్నే.. సతీమణితో సమ్మర్ ట్రిప్
డీజే టిల్లు కాదు.. మన మల్లన్నే.. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫుల్ జోష్ మీద ఉన్నారు. తన సతీమణితో కలిసి సమ్మర్ ట్రిప్ కోసం జపాన్ వెళ్లారు. జపాన్ పర్యటనలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వివిధ సిటీల్లో పర్యటిస్తూ చిల్ అవుతున్నారు. స్థానిక ప్రజలతో ఫొటోలు దిగుతూ మల్లారెడ్డి సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్త వైరల్ అయ్యాయి.

జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో జరిగిన జాపనీస్ ట్రేడిషనల్ టీ కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వెరైటీ డ్రెస్సులు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే మల్లారెడ్డి బుల్లెట్ ట్రైన్ ఎక్కి అందులో కొద్ది దూరం ప్రయాణించారు. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంకా ఎన్ని రోజులు ఆయన జపాన్ పర్యటనలో ఉంటారో తెలియాల్సి ఉంది.
#Japan దేశంలో #kyoto నగరం జాపనీస్ ట్రేడిషనల్ #teaceremony కార్యక్రమంలో పాల్గొన మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి దంపతులు pic.twitter.com/m0nI4fZQvS
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) April 11, 2025
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ రజతోత్సవ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తుంది పార్టీ యంత్రాంగం. జనసమీకరణకు ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ రంగంలోకి దించారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన 3వేల ఆర్టీసీ బస్సులకు సైతం రూ.8 కోట్లను బీఆర్ఎస్ ఇప్పటికే చెల్లించింది. ఎలాగైనా ఈ సభను బిగ్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నారు. మరి ఈ లోగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హైదరాబాద్ చేరుకుంటారా.. లేదా చూడాలి.












Click it and Unblock the Notifications