ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం: గులాబీ నేతలపై మాజీమంత్రి తుమ్మల,ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల దుమారం
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేయగా, తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరును రోడ్డు మీదకి తెస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఒకరికి ఒకరికి అసలే పొసగడం లేదన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

ఖమ్మం జిల్లాలో కోల్డ్ వార్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ అష్టకష్టాలు పడుతుంది. నేతల మధ్య సఖ్యత లేకపోవటం, సమన్వయం లేకపోవటం వెరసి పార్టీ బలహీనపడుతుంది. తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో ఆయన ప్రాధాన్యత ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో క్రమంగా తగ్గినట్లు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గతంలో చర్చ సాగింది. అంతేకాదు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు పాలేరు నియోజకవర్గంలో తుమ్మలను ఓడించిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి మధ్య కూడా వార్ కొనసాగుతుందని స్థానిక నేతల్లో చర్చ ఉంది.

పార్టీ నేతలపై మాజీ మంత్రి తుమ్మల సంచలనం
కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి విజయం సాధించి ఆపై టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేతలు కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం తో స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరగడం పార్టీ నేతల మధ్య సఖ్యత లేదన్న , సమన్వయ లోపం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో కొందరు పార్టీని నాశనం చెయ్యాలని కుట్రలు
పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీని నాశనం చేద్దామని చూసినా, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ పార్టీ పరువు పోకుండా కాపాడారని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా తాతా మధును గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అశ్వరావుపేట అభివృద్ధి చేశానని గుర్తు చేసిన తుమ్మల, ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశానని పేర్కొన్నారు. రాజకీయాలలో కొనసాగినంత కాలం అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఏదో ఒక విధంగా అభివృద్ధి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. సొంత పార్టీలోనే పార్టీని నాశనం చేసే నాయకులు ఉన్నారంటూ తుమ్మల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అంతర్గత పోరును స్పష్టంగా చెబుతోంది. కొందరు నాయకులు టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని చాలా కాలంగా పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతుంది.

కొందరు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఎమ్మెల్సీ తాతా మధు
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ తాతా మధు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన అంశాన్ని గుర్తు చేసి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు పార్టీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాతా మధు పేర్కొన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాదిరిగా అవసరం అనుకున్నప్పుడు కాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉందని, తాత మధుసూదన్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధు అభినందన సభను అశ్వరావుపేటలో నిర్వహించిన క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల అభివృద్ధికి కేరాఫ్ గా నిలబెట్టారని, తన గెలుపుకు కారణమైన తుమ్మలకు, తన గెలుపులో ఎక్కువ భాగం శ్రమించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మంలో అధికార పార్టీలో కుమ్ములాట.. బయటపడుతున్న అంతర్గత పోరు
కొంతమంది వ్యక్తులు పార్టీకి నష్టం కలిగించే విధంగా పని చేస్తున్నారని, అలా టిఆర్ఎస్ పార్టీని వారు ఏమీ చేయలేరు అని ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ పై సమగ్రంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని తాత మధు పేర్కొన్నారు. పార్టీలో ఉండాలని భావిస్తూ అభివృద్ధికి పాటుపడాలని అవసరం ఉందని తాతా మధు వెల్లడించారు. తాజాగా తాత మధు చేసిన వ్యాఖ్యలు కూడా కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని, టిఆర్ఎస్ పార్టీలో అటువంటి నేతలు ఉన్నారు అన్న భావనను స్పష్టంగా చెప్తుంది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ముఖ్య నేతలకు ఏమాత్రం పడటం లేదన్న సంకేతాలు అధినాయకత్వం దాకా వెళ్ళిన క్రమంలో ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికి కూడా గులాబీ బాస్ ఖమ్మం జిల్లాలో నేతల మధ్య అగాధాన్ని పూడ్చటానికి ప్రయత్నాలు చెయ్యకుంటే భవిష్యత్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళీ టీఆర్ఎస్ కు దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకుల భావన.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications