మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కుటుంబంలో తీవ్ర విషాదం
కరీంనగర్: చొప్పదండి నియోెజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త, మాజీ పీపుల్స్ వార్ నేత గాలన్న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కరీంనగర్‌లో ని లైఫ్‌లైన్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
గాలన్న మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారన్నారు.

గాలన్న.. శంకరపట్నం జడ్పీటీసీగా, చొప్పదండి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సతీమణి శోభక్కకు అండగా ఉండి పనిచేశారని వినోద్ కుమార్ గుర్తు చేసుకున్నారు. బొడిగె గాలన్న చిన్నతనం నుంచే పేద ప్రజల సమస్యలపై పోరాటం చేశారని ఆయన తెలిపారు. వామపక్ష పార్టీలలో పనిచేశారని, గాలన్న మృతి తీరని లోటన్నారు.
గాలన్న మృతదేహాన్ని స్వగ్రామమైన సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లెకు బంధువులు తరలించారు. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ తరపున చొప్పదండి ఎమ్మెల్యే గెలిచిన శోభక్క.. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications