Jaggareddy: పీసీసీ పదవిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవిపై ఆయన తన అభిప్రాయం చెప్పారు. తాను పీసీసీ పదవి కోరుకోవడం కొత్త కాదని చెప్పారు. అవకాశం వచ్చిన ప్రతి సారి అడుగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రెడ్లలో అవకాశం వస్తే లిస్టులో తాను కూడా ఉంటానని పేర్కొన్నారు. పీసీసీ మార్పుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే పీసీసీ మార్పు ఉండొచ్చన్నారు.

బస్టాండ్ లో తాను ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతానని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి లాభం చేకూరేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రశాంత్ కిషోర్ ఓసారి బీజేపీ అంటారు ఇంకోసారి కాంగ్రెస్ అంటారన్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పారు కానీ కాంగ్రెస్ వచ్చిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అవగాహన మాట్లాడుతున్నారని చెప్పారు.

Former MLA Jaggareddy made key comments on the post of PCC president

అంతకు ముందు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చూపించాలన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్‌కు 20 వేల మెజారిటీ రావాలని కోరారు. తాను ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తిని కాదన్నారు. గెలిచిన ఎమ్మెల్యే ప్రోటోకాల్‌ను ఎవరూ బ్రేక్‌ చేయవద్దని కోరారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ప్రతి మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుంటామని, సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సంగారెడ్డికి వీలైనన్ని నిధులు తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుందని, ఎన్ని నిధులు రావాలో అన్నింటిని తీసుకొస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+