వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి షాక్: యెన్నం రాజీనామా, హైద్రాబాద్‌లో ఆంధ్రా కోచింగ్ సెంటర్లు: ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: వరంగల్ ఉప ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పెద్ద షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాకు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు కమలం పార్టీకి రాజీనామా చేశారు.

ఆయన తన రాజీనామా పత్రాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున గెలిచారు.

ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ... బీజేపీని వీడుతున్న తనకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెప్పారు. తాను ఇంకా తెలంగాణ బచావో మిషన్‌లోనే ఉన్నానన్నారు. ఉద్యోగం మానేసి ఉద్యమంలో చేరానని, తెలంగాణ
గమ్యాలు, లక్ష్యాలు దూరమవుతున్నాయన్నారు.

ఉద్యమకారులను ఇప్పటివరకు సత్కరించుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయని, ప్రత్యామ్నాయ వేదిక కోసమే తొలి అడుగు వేస్తున్నట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. బడుగుల తెలంగాణ కోసం
కృషి చేస్తామన్నారు.

 Former MLA Yennam Srinivas reddy resigns BJP party

నాగం జనార్ధన్ రెడ్డి కూడా షాకిచ్చేనా?

యెన్నం శ్రీనివాస్ రెడ్డి బిజెపికి రాజీనామా చేయడంతో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగం స్థాపించిన తెలంగాణ బచావత్‌లో యెన్నం కూడా ఉన్నారు. దీంతో నాగం కూడా బిజెపికి దూరం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పైరవీలు ఉండవు: ఈటెల

ప్రభుత్వం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి పైరవీలు ఉండబోవని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారులకు డబ్బులిచ్చి మోసపోద్దని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆదివారం అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఈటల సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సొంతఖర్చులతో 1,800 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. టీఎస్‌పీఎస్సీ నియమకాల్లో ఎలాంటి పైరవీలు ఉండవని, అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మవద్దన్నారు.

హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొన్ని కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లు చేస్తున్నాయని, ఉద్యోగాల విషయంలో మభ్యపెడుతున్నాయన్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి మోసపోద్దన్నారు.

English summary
Mahabubnagar former MLA Yennam Srinivas Reddy has resigned to BJP on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X