Venkata Swamy: ఘనంగా వెంకటస్వామి జయంతి వేడుకలు..
మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొని కాకాను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ ప్రజలతో వెంకటస్వామికి ప్రత్యేక అనుభందం కిషన్ రెడ్డి అన్నారు. ఆయన కార్మికులకు అనే కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కాకా పక్షపాతి అంటూ కొనియాడారు. వెంకటస్వామి కార్మిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పోరాటం చేశారని పేర్కొన్నారు. పేదల కోసం వందల బస్తీలు కట్టించారని, హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లి కాకా, అంజయ్య పేర్లను ప్రజలు నిత్యం తలుచుకుంటారని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో పేదలకు శాశ్వత ఇళ్లు కట్టించిన నేత వెంకటస్వామి అని లక్ష్మణ్ గుర్తు చేశారు. తాను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు కాకాతో ప్రత్యేక అనుభందం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కాకాకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. వెంకటస్వామి రాష్ట్రపతి కావాల్సి ఉండేదని కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరైన గుర్తింపు విమర్శించారు. కాకా ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు.












Click it and Unblock the Notifications