TS Genco: పరీక్ష రాయకుండానే ఏఈ ఉద్యోగం.. స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ..

తెలంగాణ జెన్ కోలో దాదాపు 25 మంది అక్రమంగా ఉద్యోగం సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలుమార్లు సమాచార హక్కు చట్టం కింద అధికారులను కోరినా వారు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. 2017 మే 30న జెన్ కో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓ మహిళను ఉద్యోగిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది జులై 27 ఆ మహిళకు నియామక పత్రం కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సదరు మహిళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ కీలక ప్రజాప్రతినిధి మేనల్లుడి భార్య అని ప్రచారం జరుగుతోంది. అక్రమంగా ఉద్యోగం ఏఈ సాధించిన ఆమె ఏనాడు కూడా కార్యాలయానికి రాలేదని.. నెలకు రూ.1,50,000 జీతం తీసుకుని ఇంట్లోనే ఉందని అరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాగానే ఆమె విధుల్లో చేరడంతో తోటి ఉద్యోగులు షాకైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి దొంగ నియామకాలు జెన్ కోలోనే కాకుండా పలు విభాగంగాల్లో కూడా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Former MP Vinod Kumar reacted to a woman getting a job in Telangana Genco

అయితే విషయంపై మాజీ బోయినపల్లి వినోద్ రావు స్పందించారు. మాజీ జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారు. కావాలనే దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జెన్‌కో సంస్థలో బోయినపల్లి సరిత అనే మహిళను అసిస్టెంట్ ఇంజినీర్ గా నియమించడం చర్చనీయాంశంగా మారింది.

ఇంటిపేరు ఒకటి అయితే బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నవి కాబట్టే తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనివినోద్ అన్నారు. ఒక వార్త పబ్లిష్ చేసేముందు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని సూచించారు. తన 20 ఏళ్ల రాజకీయంలో తాను ఏనాడు తప్పు చేయలేదని చెప్పారు. బండి‌సంజయ్ తనపై బిజేపి కార్యకర్తలతో దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+