నయీం కేసులో కొత్త కోణం: 4రోజులుగా రహస్యంగా మాజీ డీఎస్పీ విచారణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎన్నో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, గతంలో భువనగిరి డిఎస్పీగా పని చేసిన మాజీ అధికారిని ఒకరిని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు విచారించారని తెలుస్తోంది.
సదరు అధికారికి నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తోంది. అతనిని గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారని తెలుస్తోంది. నయీంతో సంబంధాలున్నాయని అనుమానం కలగడంతో, అతనిని అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది.

సదరు అధికారి మాధవ రెడ్డి హత్య సమయంలో డీఎస్పీగా పని చేశారని తెలుస్తోంది. అనంతరం కాలంలో అతను ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో గ్యాంగ్ స్టర్ నయీం పోలీసుల కాల్పుల్లో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇద్దరు నయీం అనుచరుల అరెస్ట్
కరీంనగర్ జిల్లా కోరుట్ల బీడీ వ్యాపారిని బెదిరించిన కేసులో ఇద్దరు నయం అనుచరులు అరెస్టయ్యారు. సుధాకర్, శ్రీధర్ రాజులను పోలీసులు అరెస్టు చేసి మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications