పంజాబ్ మాజీ సీఎం, ఏపీ మాజీ గవర్నర్ బర్నాలా కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (సమైక్య) మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా కన్నుమూశారు. చండీగర్‌లోని పిజిఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటికి తుది శ్వాస విడిచారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (సమైక్య) మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా కన్నుమూశారు. చండీగర్‌లోని పిజిఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటికి తుది శ్వాస విడిచారు.
ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. బర్నాలా అక్టోబర్ 21, 1925లో హర్యానాలోని అటేలీలో జన్మించారు.

క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 1977లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పని చేశారు.
అనంతరం 1985 నుంచి 1987 వరకు పంజాబ్ ముఖ్యమంత్రి గానూ ఉన్నారు. 2000 నుంచి 2011 మధ్య ఉమ్మడి ఏపీ, తమిళనాడు, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్నారు. బర్నాలా మృతికి పలువురు సంతాపం తెలిపారు.
బర్నాలా కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశానికి బర్నాలా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications