హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి వెంటే: ఇంటికెళ్లి గ్రీటింగ్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన పార్టీ నాయకుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. క్రమంగా పార్టీ సీనియర్ నేతలను ఒక్కటి చేస్తోన్నారు. తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోన్నారు. తనకు అండగా నిలిచేలా మలచుకొంటోన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన తనకు రాష్ట్ర స్థాయిలో పార్టీపరంగా అత్యున్నత స్థానాన్ని కట్టబెట్టడం వల్ల సీనియర్ నేతల్లో నెలకొన్న అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చడంలో సక్సెస్ అవుతోన్నట్టే కనిపిస్తోంది.

రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ ఫోకస్.. బిగ్ ప్యాకేజ్: చంద్రబాబు ఇంటికి వెళ్లే దారి విస్తరణరాజధాని అమరావతిపై వైఎస్ జగన్ ఫోకస్.. బిగ్ ప్యాకేజ్: చంద్రబాబు ఇంటికి వెళ్లే దారి విస్తరణ

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన మాజీ మంత్రి కొండా సురేఖ.. రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత- బీసీ మహిళకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఒకదశలో కొండా సురేఖ పేరును కూడా పరిశీనలోకి తీసుకున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. దీనితో ఆమె కూడా ఈ పదవిపై ఆశలు పెంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చిన కొండా సురేఖ్..మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్‌లల్లో చేరినప్పటికీ.. మళ్లీ సొంతగూటికే వచ్చారు.

former Telangana Congress MLA Konda Surekha meets PCC Chief Revanth Reddy

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని కొండా సురేఖ స్వాగతించినట్టే. ఈ కారణంతోనే ఆమె ఆయన నివాసానికి వెళ్లి మరీ.. శుభాకాంక్షలు తెలిపారు. ఓ మొక్కను ఇచ్చి గ్రీటింగ్స్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో కురువృద్ధుడిగా గుర్తింపు పొందిన వీ హనుమంత రావును ఆసుపత్రికి వెళ్లి పలకరించారు రేవంత్ రెడ్డి. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట సీనియర్ నేత, మాజీమంత్రి జీ చిన్నారెడ్డి ఉండటం.. రేవంత్ నాయకత్వం పట్ల ఆయన సానుకూలతను వ్యక్తం చేసినట్టే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి అసమ్మతులను రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగిస్తారనేది ఆసక్తిగా మారింది.

former Telangana Congress MLA Konda Surekha meets PCC Chief Revanth Reddy
English summary
Telangana Congress Party senior leader and former MLA Konda Surekha meets newly appointed PCC Chief Revanth Reddy at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X