ఖతార్ నుంచి వస్తున్న వారిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్తూ.. ఘోర ప్రమాదం, 4గురి మృతి
హైదరాబాద్: శామీర్ పేట మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న లారీ - కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్, మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతులు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రాజు, సత్తెవ్వ, శ్రవణ్, శాలినిలుగా గుర్తించారు. ఖతార్ నుంచి వస్తున్న తమ వారిని రిసీవ్ చేసుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

జగిత్యాల నుంచి వస్తుండగా తుర్కపల్లి వద్ద శుక్రవారం వేకువజామున 3-నాలుగు గంటల మధ్య ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications