హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rain Alert: హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలంగాణాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచే పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో అది అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

 Four more days heavy rains in Hyderabad and telangana statewide

నైరుతి రుతుపవనాలకు తోడు అల్ప పీడనం ప్రభావం కూడా రాష్ట్రంపై ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు కూడా రావచ్చని తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనతో హైదరాబాద్ నగరంలోని అధికారులు, రెస్క్యూ సిబ్బంది అప్రమత్తయ్యారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా, మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అదికారులు, ప్రజలు అప్రమత్తమవుతున్నారు.

English summary
Four more days heavy rains in Hyderabad and telangana statewide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X