నలుగురు నగరవాసులు అజ్మీర్‌లో మృతి (ఫోటోలు)
హైదరాబాద్: రాజస్ధాన్‌లోని అజ్మీర్ దర్గాను సందర్శించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌లోని చిలకలగూడ వాసులు మృత్యువాత పడ్డారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
సికింద్రాబాద్‌లోని వారాసిగూడలోని షాబాజ్ గూడ ప్రాంతంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు 11 మంది అజ్మీర్ దర్గా దర్శనానికి వెళ్లారు. దర్గాకు సమీపంలో శనివారం రాత్రి వీరి టాటా సుమో వాహనాన్ని భారీ ట్రక్కు ఢీకొట్టింది.

అజ్మీర్ దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు నగరవాసులు మృతి
బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ షకిల్ ఖాన్ తన భార్య జుబేదా బేగం, కుమారులు ఉమాయన్ ఖాన్, సైఫ్ ఖాన్, యాజా ఖాన్, కుమార్తె దనియాబేగంతో పాటు వారింట్లో అద్దెకు ఉండే సయ్యద్ షకిల్, కుమార్తెలు మిజ్వా, ఉమేరా, భార్య నసీమా, తల్లి ఖాజా బేగం ఈ నెల 6న రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లారు.

అజ్మీర్ దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు నగరవాసులు మృతి
సయ్యద్ షకిల్ (45), సైఫ్ ఖాన్ (7), మిజ్వా (5), ఉమేరా (9) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మిగతావారిని అక్కడి జవహార్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు.

అజ్మీర్ దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు నగరవాసులు మృతి
బంధువులు, మిత్రులు వారి నివాసం వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఇక ఆసుపత్రిలో చేర్పించిన వారిని పరమార్శించేందుకు కుటుంబ సభ్యులు ఆదివారం అజ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు.

అజ్మీర్ దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు నగరవాసులు మృతి సోమవారం నాటికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
అజ్మీర్ దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు నగరవాసులు మృతి
సోమవారం నాటికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అజ్మీర్ దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు నగరవాసులు మృతి
సికింద్రాబాద్‌లోని వారాసిగూడలోని షాబాజ్ గూడ ప్రాంతంలో షకీల్ ఖాన్ ఇళ్లు. ఈ ఇంట్లో నివాసం ఉంటున్న 11 మంది అజ్మీర్ దర్గా దర్శనానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications