ఏడాదిలో నలుగురు ఖైదీల పరార్‌: కోర్టుకు తీసుకెళ్తుండగా రెండుసార్లు, జైలు నుంచి ఒకసారి

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ కేంద్ర కారాగారం పెద్దదిగా పేరుంది. అదే స్థాయిలో ఇక్కడ భద్రత చర్యలు చేపడుతున్నారు. అయినా కొన్ని లోపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏడాదిలో విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లి, తీసుకొస్తుండగా రెండుసార్లు ఎస్కార్టు కళ్లుగప్పి పారిపోగా, ఒకసారి నేరుగా వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచే ఇద్దరు పారిపోయారు. మూడు సంఘటనల్లో నలుగురు ఖైదీలు పారిపోయారు.

ఆ వివరాలు ఇలా..
గత ఏడాది మే 16వ తేదీన హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన సూరి అలియాస్‌ సురేష్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చి తిరిగొస్తుండగా జనగామ ప్రాంతంలో ఎస్కార్ట్‌గా ఉన్న కమిషనరేట్‌ ఏఆర్‌ సిబ్బంది కళ్లు కప్పి పారిపోయాడు. ఉప్పల్‌ సూరి కరుడుగట్టిన నేరస్థుడు. పలు హత్య కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఒక కేసులో జీవితఖైదీ శిక్షను అనుభవిస్తున్నాడు. అతన్ని విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లి.. వస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.

Four prisoners escaped from Warangal central jail

ఇప్పటి వరకూ పోలీసులకు చిక్కలేదు. ప్రస్తుతం సూరి కోసం గాలించడం కూడా పోలీసులు వదిలివేశారు. నవంబరు 11న అర్ధరాత్రి దాటాక కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు సైనిక్‌సింగ్‌, రాజేశ్‌యాదవ్‌ జైలు గోడలను దూకి పారిపోయారు. సైనిక్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాకలో అక్కడి పోలీసులు గుర్తించి వరంగల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇతను పారిపోయిన మూడు రోజులలో దొరికాడు.

రాజేశ్‌యాదవ్‌ను మాత్రం నెల రోజుల తరువాత బిహార్‌లో వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. తాజాగా కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న చంద్రమోహన్‌ అనే ఖైదీని వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో హాజరుపర్చి తీసుకొస్తుండగా యశ్వంతపూర్‌ వద్ద పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు.

జైలులో సిబ్బంది అప్రమత్తం..

వరంగల్‌ కేంద్ర కారాగారంలో పీడీ యాక్టులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పారిపోవడంతో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతను పారిపోవాలనే ముందే ప్రణాళిక వేసుకున్నాడా? అని ఆరాతీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four prisoners escaped from Warangal central jail in a year.
Please Wait while comments are loading...