హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యాభర్తల వివాదం: కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు 4 వారాలు జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసులకు హైకోర్టు నాలుగు వారాలు జైలు శిక్ష విధించింది. జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి గత సంవత్సరం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని పోలీసు అధికారులపై అభియోగాలు దాఖలయ్యాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసినట్లు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు.. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు నాలుగు వారాలు జైలు శిక్ష విధిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

four weeks jail punishment for police officers in contempt of court case

ఈ నలుగురిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది కోర్టు. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.

English summary
four weeks jail punishment for police officers in contempt of court case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X