విషాదం: కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
హైదరాబాద్: పండగరోజున విషాద ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు యువకులు మృతి చెందారు. పండగ రోజు కావడంతో సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.
లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరిఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గుర్తించి మృతదేహాలు వెలికి తీశారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్‌లుగా గుర్తించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications