ఫాక్స్‌కాన్ కేరాఫ్ హైదరాబాద్: రేవంత్ పెట్టుబడుల వేట షురూ

Foxconn: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. పెట్టుబడుల వేట మొదలు పెట్టింది. హైదరాబాద్ సహా టయర్ -1 నగరాల్లో పెట్టుబడులను విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. దీనికి అవసరమైన పారిశ్రామిక విధానంపై కసరత్తు చేస్తోంది.

అదే సమయంలో ఇప్పుడున్న పరిశ్రమలు, ఐటీ కంపెనీల విస్తరణపైనా దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. తమ కార్యాలయాలు, తయారీ కేంద్రాలు, ప్లాంట్లు, యూనిట్లను విస్తరించదలిచిన కంపెనీల యజమానులకు భారీగా రాయితీలను ప్రకటించే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది.

Foxconn representatives met CM Revanth Reddy

ఇందులో భాగంగా- ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో ఏర్పాటైన ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఫాక్స్ కాన్‌కు చెందిన హ్యాన్‌హై ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పస్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి మరింత మెరుగైన విధానాలను అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందిస్తామని అన్నారు.

పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటు, వాటి విస్తరణకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+