వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: హైదరాబాద్‍లో నయా మోసం.. ఏటీఎం నుంచి డబ్బులు తీసినా అకౌంట్లో పైసలు కట్ అవ్వడం లేదు..

|
Google Oneindia TeluguNews

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మోసగాళ్లు కొత్త దారులు వెతుకుతూ మోసం చేస్తున్నారు. ప్రజలనే కాదు బ్యాంకులను కూడా చీట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలో డబ్బు తీసినా ట్రాన్సక్షన్ కానట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఫతేనగర్‌ మహేష్‌ బ్యాంక్‌ సమీపంలో ఉన్న ఏటీఎం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 7 లక్షలు డ్రా చేశారు.

రెండు దఫాలుగా
వాళ్లుడు డబ్బులు డ్రా చేసినా ఏ ఖాతా నుంచీ రూపాయి కూడా కట్‌ కాలేదని బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా వారికి ఓ విషయం తెలిసింది. డబ్బు డ్రా చేస్తున్ సమయంలో ఏటీఎం మిషన్‌ కు కరెంట్‌ సరఫరా నిలిపివేసినట్లు గుర్తించారు. అక్టోబర్ 23న మహేష్‌ బ్యాంక్‌ ఏటీఎం నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పలు డెబిట్‌ కార్డులతో రూ. 7 లక్షలు విత్ డ్రా చేశారు. ఆ తర్వాత అక్టోబర్‌ 5న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఏటీఎం నుంచి రూ. 3.40 లక్షలు
తీశారు.

Fraudsters withdrawing money by cutting off power to ATM machines

పోలీసుల దర్యాప్తు
ఈ రెండు సందర్భాల్లో ఏ ఖాతా నుంచి కూడా డబ్బులు విత్ డ్రా చేసినట్లు కనిపించలేదని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు ఏటీఎంకు వచ్చే విద్యుత్‌ సరఫరాను ఆపివేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాద్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఇలా చేస్తున్నట్లు గుర్తించామని సనత్ నగర్ సీఐ ముత్తుయాదవ్‌ చెప్పారు. ఏటీఎంకు కరెంట్ సరఫరా నిలివేయడం ద్వారా డబ్లు మిషన్ నుంచి బయటకు రాగానే వాటి తీసుకుంటున్నారని వివరించారు. అలా ట్రాన్సాక్షన్‌ కానట్లు చూపిస్తుందని పేర్కొన్నారు.

English summary
Some gangs are withdrawing money by stopping power supply to ATMs. The police are investigating in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X