మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పేలుతున్న మీమ్స్; టీఎస్ఆర్టీసీకి పురుషుల విజ్ఞప్తులు!!

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చినట్టు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చింది. దీంతో నేటి నుంచి మహిళలు మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయనున్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే వారు ఆర్టిసి బస్సులలో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా సరే ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఈ పథకం ద్వారా ఉంటుంది.

అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై పురుషుల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకనుండి ఇళ్లల్లో ఉండే స్త్రీలను ఏమీ అనకండి.. వాళ్లకు ఇకపై బస్సు ఫ్రీ. మీ మీద కోపంతో వాళ్ళు ఏ బస్సు అయినా ఎక్కితే, వాళ్లను వెతకడానికి మీరు డబ్బులు పెట్టుకొని తిరగాలి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ చెక్కర్లు కొడుతున్నాయి.

 Free bus travel for women.. shocking memes; Appeals from Men to TSRTC!!

ఇక మహిళలకు ఉచిత బస్సుల వల్ల, బస్సులలో మహిళల డామినేషన్ పెరుగుతుందని ఇలాంటి సమయంలో పురుషుల కోసం ఆర్టీసీ కొన్ని చర్యలు చేపట్టాలని కూడా సూచనలు వెల్లువెత్తుతున్నాయి. మగవారిని గౌరవిద్దాం మగవారికి కేటాయించిన సీట్లలో మగవారిని కూర్చోనిద్దాం. ఈ బస్సు మన అందరిదీ అంటూ మీమ్స్ చెక్కర్లు కొడుతున్నాయి.

ఒకప్పుడు స్త్రీలను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం అంటూ ఆర్టీసీ బస్సులలో పెద్ద ఎత్తున రాసి ప్రచారం చేసిన ఆర్టీసీ, ఇప్పుడు దానిని మార్చి మగవారి కోసం రాయాలని కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల మగవాళ్ళు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం వల్ల మగవాళ్లకు వచ్చిన ఇబ్బంది మరెవరికి రాకూడదని సోషల్ మీడియాలో లబోదిబోమంటున్నారు. చివరికి బస్సుల్లో మగవాళ్ళ కోసం సీట్లు కూడా ఉండని పరిస్థితి దాపురించిందని నెటిజన్లు సరదాగా ఈ పథకం పై సెటైర్లు వేస్తున్నారు. ఇక నేడు మహాలక్ష్మీ పథకం ప్రారంభం కావటం తో ఆర్టీసీ బస్సులలో మహిళల హడావిడి కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+