హైదరాబాద్ లో లక్ష మట్టి గణపతుల బొమ్మలు ఫ్రీ..ఫ్రీ: దొరికే లొకేషన్లు ఇవే..
కాలుష్యాన్ని నివారించడంపై భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న జనాభా, రవాణా, వ్యర్థాల నిర్వహణ వంటి పట్టణీకరణ సమస్యలతో తలెత్తుతున్న వాయు, జల, భూ కాలుష్యాన్ని తగ్గించడానికి హెచ్ఎండీఏ ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ క్రమంలో పర్యావరణ హిత గణేశుడి విగ్రహాలను ప్రోత్సహిస్తోంది. మట్టి గణపతుల విగ్రహాలను వినియోగించాలంటూ ఎప్పటినుంచో ప్రచారం చేస్తోంది. మట్టి విగ్రహాలను నీటి వనరులలో నిమజ్జనం చేయడం వల్ల జల వనరులకు ఎటువంటి హాని ఉండదని చెబుతోంది హెచ్ ఎండీఏ.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించడానికి 2017 నుండీ HMDA ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది లక్ష మట్టి గణేశుడి విగ్రహాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రజలు, స్వచ్ఛంద సంస్థలకు వీటిని ఉచితంగా పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌లో 34 ప్రాంతాలలో ఈ పంపిణీ జరుగుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
HMDA మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా లభించే సెంటర్లు ఇవే..!!#HDMA #GanapathiIdols #GaneshChaturthi #Ganeshotsav2025 #VinayakaChavithi2025 #NewsUpdate #Oneindiatelugu pic.twitter.com/lv9uNdbw7d
— oneindiatelugu (@oneindiatelugu) August 22, 2025
సైలెంట్ వ్యాలీ- బంజారా హిల్స్, రోడ్ నంబర్ 10 ఐఎఎస్ క్వార్టర్స్- బంజారాహిల్స్, కేబీర్ పార్క్ ఎంట్రన్స్- జూబ్లీహిల్స్, గ్రీన్ ల్యాండ్స్, ప్రెస్ క్లబ్- సోమాజీగూడ, ఎల్లమ్మ దేవాలయం- బల్కంపేట్, పెద్దమ్మ ఆలయం- జూబ్లీహిల్స్, రైతు బజార్- మెహదీపట్నం, శిల్పారామం- హైటెక్ సిటీ, శిల్పారామం- ఉప్పల్.. వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications