వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా,బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా చికిత్స అందించాలి.!సత్యాగ్రహ దీక్షలో టీ సర్కార్ పై కాంగ్రెస్‌ ఆగ్రహం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగులకు, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ఉచిత చికిత్స అందించాలని, అందరికీ వ్యాక్సిన్‌ టీకాలు వేసేలా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కోవిడ్‌ టీకాలు ప్రజకు అందుబాటులో ఉంచడంలో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం, తెలంగాణలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పూర్తిగా విఫలం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రజలందరికీ ఉచిత కోవిడ్‌ టీకాలు వేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన సత్యాగ్రహ దీక్షను ఉద్దేశించి ముఖ్యనేతలు ప్రసంగించారు.

కరోన, బ్లాక్ ఫంగస్ కు ఉచిత చికిత్స అందించాలి.. సత్యాగ్రహ దీక్షలో ఉత్తమ్ డిమాండ్.

కరోన, బ్లాక్ ఫంగస్ కు ఉచిత చికిత్స అందించాలి.. సత్యాగ్రహ దీక్షలో ఉత్తమ్ డిమాండ్.


దేశంలోనూ,రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాయని, వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, ఆరోగ్య శ్రీ లో కరోన, బ్లాక్ ఫంగస్ చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు అందించాలని, రాష్ట్రంలో కరోనో ఒక భయంకర పరిస్థితులను సృష్టించిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం వెంటనే కరోనో, బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా సత్యాగ్రహం చేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు.

వ్యాక్సీన్ పట్ల సీఎం నిర్లక్ష్యం.. కరోనా మరణాలకు సీఎం బాద్యత వహించాలన్న భట్టి విక్రమార్క..

వ్యాక్సీన్ పట్ల సీఎం నిర్లక్ష్యం.. కరోనా మరణాలకు సీఎం బాద్యత వహించాలన్న భట్టి విక్రమార్క..


రాష్ర్టంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదని, సహేతుకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క మండిపడ్డారు. గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్తారని, ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి దీపం ఆరిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని వారిని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగానలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచకుడా తెలంగాణ ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల అనేక మంది చనిపోతున్నారని,రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం చంద్రవేఖర్ రావే కారణమని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు

మనసు లేని మృగంలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు.. టీ సర్కార్ పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్..

మనసు లేని మృగంలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు.. టీ సర్కార్ పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్..


కరోనా మహమ్మారి అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ విపత్కర పరిస్థితులు దాపురించాయని, ఈపరిస్థితి కారణం ప్రధాని మోడీ, సీఎం చంద్రశేఖర్ రావు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. గతేడాది అసెంబ్లీలో కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అడిగితే సీఎం ఒప్పుకున్నారని, 9నెలలు అవుతున్నా ఇప్పటికి అమలు కాలేదని ద్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే చంద్రశేఖర్ రావు దృష్టి ఉందని, ఎంతోమంది చనిపోతున్నా చంద్రశేఖర్ రావు కు పట్టింపులేదని ఆవేదన వ్యక్తం చేసారు. ధనిక రాష్ట్రం అని చెప్పి పనికిరాని ప్రాజెక్టులకు ఖర్చు చేయడం కాదని, కరోనా వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేసారు. మనసు లేని మృగం లాగా చంద్రశేఖర్ రావు ప్రవర్తిస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.

మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.. కోవిడ్, బ్లాక్‌ ఫంగస్‌ లను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న షబ్బీర్‌ అలీ..

మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.. కోవిడ్, బ్లాక్‌ ఫంగస్‌ లను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న షబ్బీర్‌ అలీ..


తెలంగాణ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే ఎక్కువ మోతాదులో టీకా ఇవ్వాలని, కేంద్రంపై ఒత్తిడి తేవండంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని షబ్బీర్‌ అలీ విమర్శించారు. వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం పిలిచి కాలయాపన చేసిందని, చివరికి ఆ ప్రయత్నం కూడా ఫలించలేదని తప్పుపట్టారు. ఫలితంగా ఒక వ్యాక్సిన్‌ టీకాను కూడా చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం అదనంగా పొందలేకపోయిందని ఎద్దేవా చేశారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కోవిడ్, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మహ్మద్‌ షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

సత్యాగ్రహ దీక్ష విజయవంతం.. పాల్గొన్న రాష్ట్ర నాయకత్వం..

సత్యాగ్రహ దీక్ష విజయవంతం.. పాల్గొన్న రాష్ట్ర నాయకత్వం..


ఇక గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షులు శివ సేనా రెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వెంకట్, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఆడమ్ సంతోష్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి, ఉజ్మ షాకిర్ నిరంజన్, సోహైల్, సునీత రావ్, నూతి శ్రీకాంత్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.

English summary
The Congress party has demanded that the Telangana government provide free treatment to corona patients and black fungus victims and ensure that everyone is vaccinated.The leaders addressed a satyagraha Deeksha at Gandhi Bhavan on Monday as part of a nationwide protest by the Congress party demanding free Kovid vaccination for all people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X