సారిక, ఆమె పిల్లల మృతి కేసులో ఆ నివేదికనే కీలకం: రాజయ్య ఇల్లు సీల్
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతి కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికనే కీలకమని ఎసిపి శోభన్ కుమార్ చెప్పారు. ఈ కేసు విచారణను శాస్త్రీయంగా చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఎఫ్ఎస్ఎల్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేసును విశ్లేషిస్తుందని చెప్పారు. ఈ నివేదికను హత్యా, ఆత్మహత్యనా అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాజయ్య కుటుంబ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ తర్వాతనే ఏం జరిగిందనేది తెలుస్తుందని ఎసిపి అన్నారు.

రాజయ్యను, ఆయన భార్య మాధవిని, కుమారుడు అనిల్ కుమార్‌ను పోలీసులు గురువారం రెండో రోజు కూడా విచారించారు. విచారణ నిమిత్తం ఆ ముగ్గురిని తీసుకుని వచ్చినట్లు, విచారణ కొనసాగుతున్నట్లు శోభన్ కుమార్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
మొదటి అంతస్థులో సారిక, ఆమె కుమారులు అభినవ్, అయాన్, శ్రీయాన్ కాలి మరణించారు. నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. ఆ ప్రమాదం జరిగిన రోజు రాత్రి రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ ఇంట్లోనే ఉన్నారని పోలీసు కమిషనర్ జి. సుధీర్ బాబు చెప్పారు. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు రాజయ్య ఇంటిని సీల్ చేశారు.












Click it and Unblock the Notifications