గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో కలకలం: చికెన్ బిర్యానీలో కప్ప కళేబరం!

హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించడం కలకలం రేపింది. బిర్యానీలో కప్పను చూసిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మెస్ ఇంఛార్జీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షం అంటూ సోషల్ మీడియాలో ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది.

అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కదాంబ మెస్‌లో చికెన్ బిర్యానీ తీసుకోగా.. అందులో కప్ప వచ్చింది. బిర్యానీలో వచ్చిన కప్ప కళేబరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బహిర్గతమైంది. ట్రిపుల్ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

Gachibowli IIT stir Chicken biryani with frog carcass

ఇప్పటికే బయట ఫుడ్ తినాలంటేనే ప్రజలు జంకుతున్నారు. జంట నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడుతున్నారంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయం తెలిసిందే. వైన్ షాపుల వద్ద చికెన్ వంటకాలను అందించే స్టాళ్లకు సరఫరా చేసే ఓ స్టోరేజీ నుంచి సుమారు 700 కిలోల కుళ్లిపోయిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు.

మరోవైపు, జంట నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పరిశుభ్రత ఉండటం లేదని, గడువు తీరిన పదార్థాలను వాడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ హోటళ్లతోపాటు పలు ప్రముఖ హోటళ్లలోనూ పరిశుభ్రత, నాణ్యత అంతంత మాత్రంగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+