గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి (ఫోటోలు)

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులకు, మెడికల్ కళాశాల సిబ్బందికి శనివారం జరిగిన ఘర్షణ రోగుల్లో ఆందోళన కలిగించింది. అన్నం కేరేజి ఆసుపత్రిలోకి తీసుకువెళ్లేందుకు అనుమతి లేదన్న నేరానికి వైద్య కళాశాల విద్యార్ధులు సెక్యూరిటీ గార్డులపై దాడి చేయడమే ఈ ఘర్షణకు ముఖ్య కారణమని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ విధులు నిర్వహిస్తుడంగా శనివారం మధ్యాహ్నాం గాంధీ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న నర్సింగ్ రావు(సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు) తమ బంధువుకి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు.

గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

ఆసుపత్రిలోకి వెళ్తున్న సమయంలో పాస్ చూపించమని అడిగాడు. నన్నే పాస్ చూపించమని అడుగుతావా అంటూ ఆగ్రహానికి గరుయ్యాడు. మెడికల్ కాలేజీ సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న నర్సింగ్ రావుతో పాటు ఐదుగురు కలిసి కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు.

 గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

ఈ దాడిలో ఐదుగురు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు విధులను బహిష్కరించి కొన్ని గంటలపాటు తమకు న్యాయం జరగాలంటూ సూపరిండెండెంట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

 గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ నర్సింగ్ రావుతో పాటు మరికొందరిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

గాంధీలో ఢిష్యుం డిష్యుం: ఒకరిపై మరొకరు కర్రలతో దాడి

సీసీ టీవి పుటేజ్ ద్వారా అసలు ఈ గొడవకు కారణం ఏమైందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూపరిండెండెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇరువర్గాలను దరిచేర్చి రాజీ కుదర్చడంలో సమస్య సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+