రైల్వే ట్రాక్‌పై గ్యాంగ్ వార్.. ఇద్దరు యువకులు మృతి...
రైల్వే ట్రాక్‌పై గ్యాంగ్ వార్.. ఇద్దరు యువకులు మృతి : కొంతమంది మద్యం మత్తులో ఏం చేస్తుంటారో వారికే తెలీయకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఘటనే ఇప్పడు హైదరాబాద్‌లో ఒకటి చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలోని భవానీనగర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై కొందరు యువకులు తాగిన మైకంలో గ్యాంగ్ వార్‌కు పాల్పడ్డారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా వారికి తెలీలేదు. కొట్టుకోవడంలో మునిగిపోయిన వీరు రైలు రావడాన్ని కూడా గమనించలేదు. ఈ ఘటనలో ట్రైన్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు.
అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం. నిన్న అర్థరాత్రి భవానీ నగర్ రైల్వేట్రాక్‌పై గంజాయి మత్తులో గ్యాంగ్‌వార్‌కు పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ మత్తులో ఒకరిపై ఒకరు గొడవలు పడుకుంటూ రైల్వై ట్రాక్‌పై నిల్చున్నారు. అయితే, మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ట్రైన్ రాకను కూడా వీరు గమనించలేదు. అయితే, అప్పడే అటుగా వస్తున్న ట్రైన్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన గంజాయి గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయారు. పట్టాలపై రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటానా రెండు మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారో ఎవరూ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మిగిలిన గంజాయ్ బ్యాచ్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

గంజాయి బ్యాచ్ వీరంగం.. భయాందోళనలో స్థానికులు : అయితే, ఈ రైల్వేట్రాక్‌పై తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, గంజాయి మత్తులో చాలామంది యువకులు ఇక్కడ తిరుగుతుంటారని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం గంజాయి అమ్మకాలకు నిలయంగా ఉందని, గంజాయి మత్తులో యువకులు ఇక్కడ వీరంగం సృష్టిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గంజాయి బ్యాచ్ కారణంగా సమీపంలో నివసించే వారు బయటికి రావాలంటే భయపడిపోతున్నారని, ఇక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications