వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాడేరు టూ మహారాష్ట్ర గంజాయి రవాణా: వరంగల్‌ కేంద్రంగా దందా

గంజాయి పంట గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో క్షేత్థ్రయిలో పండిరచేవారు. ఇక్కడ పోలీసులు, ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌ శాఖ నిఘా ఎక్కువ కావడంతో పండించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయంగా స్మగ్

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: గంజాయి పంట గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో క్షేత్థ్రయిలో పండిరచేవారు. ఇక్కడ పోలీసులు, ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌ శాఖ నిఘా ఎక్కువ కావడంతో పండించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయంగా స్మగ్లర్లు ఇతర రాష్ట్రాకు వారి రూటు మార్చుకున్నారు. నక్సలైట్లకు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రాకు వారి మకాం మార్చారు. కారడవును వీరి స్థావరాలుగా మార్చుకున్నారు. అక్కడకు పోలీసు వెళ్లే మార్గం లేక పోవడంతో అక్రమార్కుకు ఇదో అవకాశంగా మారింది.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాడేరు, చింతూరు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఏవోబీ ప్రాంతం, ఒడిశా రాష్ట్రంలోని బ్రహంపూర్‌, జార్ఖండ్‌, తెంగాణ రాష్ట్రంలోని గోదావరి తీరంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో రహస్యంగా గంజాయి పంటను పండిస్తున్నారు. అక్కడ అమాయక గిరిజన రైతుకు డబ్బు ఆశచూపి వారు పండించే వ్యవసాయ భూముల్లో మిశ్రమ పంటగా గంజాయిని వేయాలని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

It is said that ganja transportation Paderu to Maharashtra via Warangal.

గంజాయి పంటను తామే వచ్చి తీసుకెళ్తామని నమ్మిస్తుండడంతో ఆ గిరిజన రైతులు మొగ్గుతున్నట్లు తెలిసింది. రైతు నుంచి కిలోకు రూ. 200 నుంచి 500 వరకు కొనుగోలు చేసిన మాఫియా ఇతర రాష్ట్రాకు రహస్యంగా తరలిస్తూ కోట్లు కూడగట్టుకుంటుంది. మహారాష్ట్ర, బీహార్‌, ఢిల్లీ, చెన్నై, గోవా రాష్ట్రంలో స్మగ్లర్లు కిలోకు రూ, 10 వేల నుంచి రూ. 20వేల వరకు విక్రయాలు జరుపుతూ ఆర్థికంగా నిదొక్కుకుంటున్నారు.

ఆంధ్రా, ఒడిశా బార్డర్‌ నుంచి రవాణా...
ఇతర రాష్ట్రాలో పండిరచిన గంజాయి రవాణా ప్రస్తుతం ఆంధ్రా, ఒడిశా బార్డర్‌ నుంచి రహస్యంగా వరంగల్‌ జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు స్మగ్లర్లు వరంగ్‌లోనూ గంజాయిని దిగుమతి చేసి, ఇక్కడే ప్యాకింగ్‌ చేసి అవకాశం దొరికినపుడు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మహిళలే పావుగా మారి పోలీసులకు పట్టుబడుతున్నారు.

మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాలకు అటు పోలీసులు ఇటు ఎక్సైజ్‌ అధికారులు వెళ్లే అవకాశం లేకపోవడంతో స్మగ్లర్లు ఒకడుగు ముందుకేసి రైలు మార్గంతోపాటు ట్రాన్స్‌పోర్ట్‌ కార్లతో పెద్ద ఎత్తున గంజాయిని రవాణా చేస్తున్నారు. గంజాయి మాఫియా ఇతర రాష్ట్రాల రైతులు పండించిన పంటలను లారీలో ఎక్కించే క్రమంలో పత్తి, మిర్చి, కూరగాయ మధ్యలో గంజాయి బస్తాలు పేర్చి అనుమానం రాకుండా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గంజాయి ఉన్న వాహనం ముందు విలువైన కారులో పైట్‌గా వ్యవహరిస్తూ కొందరు రూట్‌ క్లియర్‌ అంటూ ఫోన్లో సూచిస్తుండడంతో ఈ చీకటి దందా యథేచ్ఛగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

ఎక్కడైనా పోలీసులకు పట్టుబడ్డవారు కూలీలు మాత్రమేనని అసు సూత్రధారులు పోలీసులకు దొరకరని తెలుస్తోంది. ఈ దందాలో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద అరెస్టయి జైళ్లలో మగ్గుతున్నవారు చాలా మంది ఉన్నారు. గంజాయితో పట్టుబడితే ఏడేళ్ల నుంచి పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

రైళ్లలో రహస్యంగా గమ్యానికి...
ఇతర రాష్ట్రాల నుంచి ప్యాకింగ్‌ చేసుకుని మాఫియా సూచన మేరకు కొందరు గుర్తుపట్టకుండా దంపతుల వలే, సాధువుల్లా, ఆర్మీ ఉద్యోగుల్లా రైళ్లలో ఎక్కుతారు. వారు చేరుకునే చోటుకి మరీ రిజర్వేషన్‌ చేయించుకుంటారు. గంజాయితో కూడిన వారి లగేజీని మరో చోట ఉంచి వీరు వేరే చోట కూర్చుంటారు. తరచూగా వారు పెట్టిన గంజాయి గేజీని చూస్తూ ట్రైన్‌లో ప్రయాణిస్తారు. ఎక్కడైనా, ఎవరైనా అధికారులు తనీఖీలు చేయడానికి వస్తే లగేజీకి సంబంధంలేని వ్యక్తుల్లా నటిస్తూ అక్కడి నుంచి జారుకుంటారు. రైల్వే పోలీసు ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉండి దిగిన వారిని పట్టుకుని విచారించి తప్పును ఒప్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తున్నారు. పోలీసులు పెద్దఎత్తున డబ్బు ఆశ చూపి తప్పించుకున్న కొందరు స్మగ్లర్ల్లున్నట్టు ఆరోపణున్నాయి.

ఒక్క నెలోనే ఏడు కేసు...
గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉండడంతో ఉమ్మడి వరంగల్‌ పోలీసులతోపాటు రైల్వే పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఒక్క జులైలోనే ఆరు గంజాయి కేసును చేధించారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు జులై 1న సతీష్‌ అనే గంజాయి రవాణాదారుడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఇదే నెలలో 4న హన్మకొండ పోలీసులు 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 24న హన్మకొండ జవహర్‌కాలనీ, కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎక్సైజ్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 30 కిలో గంజాయితో ఏడుగురు మహిళను అరెస్టుచేశారు.

English summary
It is said that ganja transportation Paderu to Maharashtra via Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X