శ్రీకాంత్ ఇంటిపై గాయత్రి కుటుంబసభ్యుల దాడి, ఉద్రిక్తత

Posted By:
Subscribe to Oneindia Telugu

యాదాద్రి:శ్రీకాంత్ చేతిలో హత్యకు గురైన గాయత్రి మృతదేహంతో ఆమె బంధువులు, ఆదివారం నాడు యాదగిరిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గాయత్రి బంధువులు,కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

ఒక దశలో కోపం పట్టలేక శ్రీకాంతో ఇంటిపై గాయత్రి కుటుంబసభ్యులు , బంధువులు దాడికి దిగారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరారు.

 Gayatri family members protest infront of Srikanth's house

అయితే శ్రీకాంత్ ను శిక్షించేవరకు ఆందోళనను కొనసాగిస్తామని గాయత్రి బంధువులు హెచ్చరించారు. యాదాద్రి దేవాలయంలో మాలిగా పనిచేస్తున్న సూదగాని సాయిలు కుమార్తె గాయత్రిని యాదగిరిపల్లెకు చెందిన శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది శనివారం నాడు కత్తితో పొడిచి చంపాడు.

స్నేహం-ఉన్మాదం: ప్రేమించలేదని నిశ్చితార్థానికి ముందు రోజు చంపేశాడు

డిగ్రీ పూర్తిచేసిన గాయత్రికి ఇటీవలే పెళ్ళి సంబంధం కూడ కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.ఇంతలోనే ఆమె హత్యకు గురికావడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

మమ్మల్ని చంపేవాడు

గాయత్రిని చంపేందుకు శ్రీకాంతో ఇంటికి వచ్చిన సమయంలో తాము ఇంట్లో ఉంటే తమను కూడ చంపేసేవాడని గాయత్రి తండ్రి సాయిలు అనుమానాన్ని వ్యక్తం చేశారు. గ్రామపెద్దలు, ఆమె తల్లిదండ్రులు శ్రీకాంత్ ను పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gayatri family members and relatives protest infront of Srikanth's house at Yadgaripally.They demanded to police punish Srikanth.
Please Wait while comments are loading...