మద్యం మత్తులో పురుషాంగం కోసేశారు: వృషణంతో ఆస్పత్రికి
హైదరాబాద్: పొలం వద్ద పడుకున్న ఓ వ్యక్తి పురుషాంగాన్ని ఇద్దరు వ్యక్తులు కత్తితో కోసి పరారయ్యారు. మద్యం మత్తులో వారు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం - చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పంబలి శివరాములు(60) మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పక్కనే ఉన్న మరో గ్రామమైన రేగడిఘనాపూర్ గ్రామానికి చేందిన జి.కుమార్ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి గురువారం రాత్రి సమయంలో పొలం వద్ద ఉన్న మేకల మంద వద్ద నిద్రపోతున్న శివరాములు మర్మాంగాన్ని కత్తితో కోశారు.

దాంతో అతను చనిపోయాడనుకొని అక్కడి నుంచి వారు పరారయ్యారు. శివరాములు బోరున విలపిస్తూ ఇంటికి పరుగెత్తి జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వెంటనే శివరాములును చేవెళ్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితుడి కొడుకు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
అయితే దీనికి కారణమైన కుమార్‌ను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పాత కక్షలను మనస్సులో పెట్టుకొని ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications