సంప్రదాయం నచ్చి.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కటైన జర్మనీ జంట

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో జర్మనీకి చెందిన ఓ జంట ఒక్కటయ్యారు. వారు ఓ దేవాలయం కళ్యాణ్ మండపంలో వివాహం చేసుకున్నారు. సబీనా, కోబియాస్ అనే ఇద్దరు మూడేళఅలుగా ప్రేమించుకుంటున్నారు. తమకు పరిచయమైన తెలుగు విద్యార్థుల సాయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

భారతీయ సంప్రదాయం పట్ల ఆసక్తి కలిగిన వారు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి వధూవరులను ఆశీర్వదించారు.

Germany couple ties knot Hindu style

చైన్ స్నాచర్‌ను ప్రతిఘటించిన మహిళ

కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ చైన్ స్నాచర్‌ను ప్రతిఘటించింది. బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ ఆదివారం పత్తి చేనుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని దుండగుడు మెడలోని చైనును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.

దీంతో ఆమె అతని చేతిని బలంగా లాగింది. దీంతో అగంతకుడు కిందపడ్డాడు. అతనికి రెండు తగిలించి, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. తేరుకున్న నిందితుడు పార్క్ చేసిన బైకును ఎక్కి పరారయ్యాడు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+