హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మోడీ, ఇవాంకా ట్రంప్ పర్యటన ఇలా: చార్మినార్ వద్ద షాపింగ్‌!

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న మెట్రో రైలు ప్రాజెక్టున ప్రారంభించనున్నారు. అదే రోజు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభిస్తారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న మెట్రో రైలు ప్రాజెక్టున ప్రారంభించనున్నారు. అదే రోజు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. మెట్రో ప్రారంభోత్సవం, భద్రతపై చర్చించారు. మెట్రో రైలుకు అన్ని అనుమతులు వచ్చాయని ఈ సందర్భంగా మెట్రో ఎంజీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Recommended Video

Ivanka Trump's hyderabad visit : ఆద్యంతం రహస్యం, ధోనీ వస్తున్నాడా ?
ఇలా మోడీ హైదరాబాద్ పర్యటన

ఇలా మోడీ హైదరాబాద్ పర్యటన

హైదరాబాద్‌లో ఈ నెల 28న మోడీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. 28న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్‌ వెళతారు. మియాపూర్‌లో మెట్రో రైలు పైలాన్‌ను ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మియాపూర్‌ నుంచి హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్‌లో చేరుకుంటారు.

ఇవాంకాతో పాటు కార్యక్రమంలో

ఇవాంకాతో పాటు కార్యక్రమంలో

అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు హెచ్‌ఐసీసీలో ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో మోడీ పాల్గొంటారు. సదస్సులో ప్రధానితో పాటు ఇవాంకా ట్రంప్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హెచ్‌ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని ఇవాంకా ట్రంప్‌, జీఈఎస్‌ ప్రతినిధులకు విందు ఇస్తారు. విందు అనంతరం మోడీ శంషాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు.

ఇవాంకా పర్యటన ఇలా

ఇవాంకా పర్యటన ఇలా

ఈ నెల 28వ తేదీన ఇవాంకా హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతారు. తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్‌లో విందులో పాల్గొంటారు. రాత్రికి మాదాపూర్‌ హోటల్లో బస చేస్తారు. 29న మధ్యాహ్నం తిరిగి అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు.

చార్మినార్ వద్ద షాపింగ్ అవకాశం

చార్మినార్ వద్ద షాపింగ్ అవకాశం

ఇవాంకా హైదరాబాద్‌లో సైట్ సీయింగ్‌కు వెళ్లనున్నారు. ఫలక్‌నామా ప్యాలెస్‌లో డిన్నర్‌తో పాటు ఆమె ఓల్డ్ సిటీలో టూర్ చేసే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ఇవాంకా చార్మినార్‌ను సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ ట్రిప్‌లో భాగంగా లాడ్‌బజార్‌లోనూ షాపింగ్ చేయవచ్చునని తెలుస్తోంది. బ్యాంగిల్స్, బ్రైడల్ వియర్‌కు ఫేమస్ అయిన లాడ్‌బజార్‌లో ఆమె షాపింగ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

English summary
US president Donald Trump's daughter Ivanka Trump's visit to India next week will not be just a trip to attend the business conclave as she will also be exploring this historic city of pearls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X