జైలులో గజల్ శ్రీనివాస్: భోజనం చేయలేదు, మాటల్లేవ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తొలి రోజు జైలులో భోజనం చేయలేదని అధికారులు ప్రకటించారు. బిస్కెట్లు, బ్రెడ్, పండ్లు మాత్రమే తీసుకొన్నారు.

అప్పుడు గజల్ శ్రీనివాస్ : 'గర్భిణీలు దేవతలు, దండం పెడతా', నేడు లైంగిక వేధింపుల్లో అరెస్ట్

ఆలయవాణి వెబ్ రేడియోలో పనిచేస్తున్న యువతి ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు. కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Ghazal Srinivas not takes food first day in jail

చంచల్ గూడ జైలులో గజల్ శ్రీనివాస్ మొదటి రోజు ఎలాంటి భోజనం చేయలేదని జైలు అధికారులు చెప్పారు. బ్రెడ్, పండ్లు మాత్రమే తీసుకొన్నారని చెప్పారు. కొందరు ఖైదీలు ఆయనతో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తే ఆయన ముభావంగా ఉన్నారని అధికారులు చెప్పారు.

  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  అండర్ ట్రయల్ 1327 నెంబర్‌ను గజల్ శ్రీనివాస్ కు జైలు అధికారులు కేటాయించారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌పై బుదవారం నాడు కోర్టులో వాదనలు జరిగాయి. కానీ, గురువారం నాడు ఈ విషయమై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ghazal Srinivas not took food first day in chanchalguda jail said officials. He was arrested for sexual harassment allegations on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి