నగరంలో కొత్త వైరస్ - పౌరులకు జీహెచ్ఎంసీ బిగ్ అలర్ట్..!!

హైదరాబాద్ లో కొత్త వైరస్ జనాల్ని భయబ్రాంతుల్ని చేస్తోంది. నొరో వైరస్ గా చెబుతున్న ఈ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ తో నగరంలో కొద్ది రోజులుగా 100 -120 కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలర్ట్ చేస్తోంది. ఇందుకు గాల కారణాలను వివరిస్తూ ముందస్తు జాగ్రత్తలను సూచిస్తోంది. నగరంలో పెరుగుతున్న ఈ వైరస్ తో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది.

నొరో వైరస్ నగరంలో విస్తరిస్తోంది. వానకాలం కావడంతో.. కలుషిత నీరు, దోమల కారణంగా... డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులతో నగర వాసులు సతమతమవుతున్నారు. తాజాగా నొరో వైరస్ అందరినీ టెన్షన్ పెడుతోంది. దీన్ని వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. నాణ్యతలేని ఆహారం, కలుషిత నీరే.. నొరో వైరస్ వ్యాప్తికి కారణమని వైద్యులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు, చలి జ్వరం, విపరీతమైన నీరసం, డీహైడ్రేషన్, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే ఈ లక్షణాలు గుర్తిస్తున్నారు.

GHMC Alerts over Noro virus in the City suggests measures to follow

ఈ వైరస్ అంటు వ్యాధి కావటంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. షుగర్ ఉన్నవారు త్వరగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. నొరో వైరస్‌ కట్టడి ప్రస్తుతానికి ఎలాంటి మెడిసిన్ లేదు. డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్‌తో.. సూచించిన జాగ్రత్తలు పాటిస్తే రెండు రోజుల్లో కోలుకొనే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రతీ ఒక్కరూ కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలి ..చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి ..ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+