హైడ్రా అధికారులకు అమ్రపాలి వార్నింగ్..!!
హైడ్రాలో అధికారుల పై జీహెచ్ఎంసీ కమిషన్ అమ్రపాలీ సీరియస్ అయ్యారు. హైడ్రా కొద్ది రోజులుగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సైతం హైడ్రా కు మరిన్ని అధికారాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా నిర్ణయాలతో
హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ చెరువులను ఆక్రమించి నిర్మాణాలను క్రమబద్దీకరించేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా ఆ నిర్మాణాల విషయంలో కఠినంగా ఉంటుందని స్పష్టం చేసారు. హైడ్రాను మరింతగా విస్తరించటంతో పాటుగా మరిన్ని అధికారాలు ఇవ్వటం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషనర్ సీరియస్
హైడ్రాకు సిబ్బందిని పలు విభాగాల నుంచి సర్దుబాటు చేసారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం హైడ్రాలో పనిచేస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, ఆ అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు అని కమిషనర్ ఆమ్రపాలి పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.
అమ్రపాలీ ఆదేశాలు
విచారణలు, రోజువారీ కార్యక్రమాలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉందని, కానీ వారు ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదని స్థాయీ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె స్పందించారు. హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించు కోవడం లేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. వారి తీరు పైన అభ్యంతరాలు రావటంతో అమ్రపాలీ ఈ స్థాయిలో స్పందించినట్లు సమాచారం.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications