• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వరద నీటిలో నగరం: కమిషనర్ సమీక్ష, తలసానికి ఫిర్యాదులు

By Nageshwara Rao
|

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో హైదరాబాద్‌ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయక చర్యల నిమిత్తం నగరంలో 220 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు.

నీట మునిగిన కాలనీలు

నీట మునిగిన కాలనీలు

నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైందని వెల్లడించారు. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు.

 పైప్ లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్ రోడ్డుపై గుంత

పైప్ లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్ రోడ్డుపై గుంత

పైప్ లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్ రోడ్డుపై గుంత ఏర్పడినట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా మ్యాన్ హోల్స్ ఎవరూ తెరవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వర్షాలు పడినపుడు సమస్యలు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.

 కాల్ సెంటర్ 040-21111111కు ఫిర్యాదులు

కాల్ సెంటర్ 040-21111111కు ఫిర్యాదులు

జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు ఫిర్యాదులు

డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని అన్నారు. అలాగే పురాతన భవనాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని నగర వాసులకు సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఎడతెరిపి లేకుండా వర్షాలు

ఎడతెరిపి లేకుండా వర్షాలు

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమీక్షలో జలమండలి ఎండీ దానకిశోర్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

 భారీ వర్షాలకు నీట మునిగిన నగరం

భారీ వర్షాలకు నీట మునిగిన నగరం

మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు నగరం నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. బుధవారం ఉదయం కాస్త తెరిపినిచ్చిన వాన మధ్యాహ్నం నుంచి తిరిగి మొదలైంది. జలమయమైన రోడ్లు నరకం చూపుతుంటే, ఇళ్లలోకి నీరు చేరి నానా అవస్థలు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లోకి నీరు

లోతట్టు ప్రాంతాల్లోకి నీరు

అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం కురిసిన వర్షానికే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నగరవాసులను ప్రస్తుత వర్షం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్లన్నీ దెబ్బతినడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

 కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వరకు ట్రాఫిక్ జామ్

కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వరకు ట్రాఫిక్ జామ్

కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. రెండుమూడు కిలోమీటర్లు సైతం ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ghmc commissioner janardhan reddy review on heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more