హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అషామాషీ విజయం కాదు, నమ్మకాన్ని నిలబెట్టాలి: నూతన కార్పొరేటర్లకు కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టింది ఆషామాషీ విజయం కాదని, తమ కష్టాలు తీరిపోతాయనే నమ్మకంతో ఈ మహత్తర విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు శనివారం నాడిక్కడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలవగా, ఆయన అందరినీ పేరుపేరునా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ‘ప్రజలు తమ కష్టాలను, సమస్యలను మీ చేతుల్లో పెట్టారు. వాటి నుంచి విముక్తి కోరుతున్నారు. బస్తీల్లో చాలా బాధలున్నాయి. వాటన్నింటినీ తొలగించే బాధ్యత ఇప్పుడు మీమీద ఉంది' అని కెసిఆర్ చెప్పారు.
నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉంటే కేవలం 150 మందికి మాత్రమే కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

‘జీహెచ్‌ఎంసీ నుంచి ఖర్చు పెట్టే ప్రతిపైసా పేదల సంక్షేమానికి ఉపయోగపడాలి. మంచినీరు, విద్యుత్తు, రహదారులు, మురికి కాలువలు తదితర మౌలిక సదుపాయాల విషయంలో మంచి ప్రణాళికలు రూపొందించాలి. నగరంలోని పేదలకు ఈ ఏడాది లక్ష ఇళ్లు కట్టివ్వాలనేది లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు విజయవంతం చేయాలి' అని సీఎం కోరారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టింది ఆషామాషీ విజయం కాదని, తమ కష్టాలు తీరిపోతాయనే నమ్మకంతో ఈ మహత్తర విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు శనివారం నాడిక్కడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలవగా, ఆయన అందరినీ పేరుపేరునా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ‘ప్రజలు తమ కష్టాలను, సమస్యలను మీ చేతుల్లో పెట్టారు. వాటి నుంచి విముక్తి కోరుతున్నారు. బస్తీల్లో చాలా బాధలున్నాయి. వాటన్నింటినీ తొలగించే బాధ్యత ఇప్పుడు మీమీద ఉంది' అని కెసిఆర్ చెప్పారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉంటే కేవలం 150 మందికి మాత్రమే కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

‘జీహెచ్‌ఎంసీ నుంచి ఖర్చు పెట్టే ప్రతిపైసా పేదల సంక్షేమానికి ఉపయోగపడాలి. మంచినీరు, విద్యుత్తు, రహదారులు, మురికి కాలువలు తదితర మౌలిక సదుపాయాల విషయంలో మంచి ప్రణాళికలు రూపొందించాలి. నగరంలోని పేదలకు ఈ ఏడాది లక్ష ఇళ్లు కట్టివ్వాలనేది లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు విజయవంతం చేయాలి' అని సీఎం కోరారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

‘ఎన్నికల సందర్భంగా కొంత మంది ఆంధ్ర, తెలంగాణ అని విభజన తెచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కూడా దాదాపు 15 చోట్ల సభలు నిర్వహించారు. కానీ నేను కేవలం ఒకే ఒక సభ పెట్టా. వారికి ఒక సీటు ఇస్తే.. మనకు 99 సీట్లు ఇచ్చారు. ప్రజలు మనపై నమ్మకం ఉంచారు. హైదరాబాద్‌ ప్రజల ఆకాంక్షకు తగ్గట్లు పనిచేయాలి' అని అన్నారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నగరాభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం మంచి ప్రణాళిక తయారు చేసుకుందాం. త్వరలోనే కార్పొరేటర్లకు రెండు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తాం. నగరానికి ఏం చేద్దాం? నిధులు ఎలా ఖర్చు పెడదాం? ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకుపోదాం? అనే విషయాలపై చర్చిద్దాం' అని ముఖ్యమంత్రి అన్నారు.

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

నూతన కార్పొరేటర్లతో కెసిఆర్

భూమ్మీద ఎవరూ వెయ్యేళ్లు పనిచేచేయలేరని, ఉన్న కాలంలో ఎంత బాగా పనిచేశామన్నదే ముఖ్యమని ఆయన కార్పొరేటర్లకు సూచించారు. ఎన్నికైన వారంతా మంచిగా పనిచేసి ప్రజల వద్ద పేరు తెచ్చుకుంటారని నమ్ముతున్నట్లు విశ్వాసం వ్యక్తంచేశారు.

English summary
GHMC corporators are on Saturday met Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X