గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం (ఫోటోలు)

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్షాలైన టీడీపీ, కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశకు గురి చేశాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్వయం గా రెండు రోజులు ప్రచారం చేసినా ప్రభావం చూపలేదు. నగరంలో టీడీపీకి పట్టున్న శేరిలింగంపల్లి లాంటి శివారు ప్రాంతంలో కూడా టీడీపీ పరాజయం పాలైంది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మిత్రపక్షం హైదరాబాద్ నగరంలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అదే బీజేపీ-టీడీపీ మిత్రపక్షానికి కేవలం 5 స్థానాలు మాత్రమే గెలిపొందాయి. శేరిలింగంపల్లి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్ధికి 80 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.

హైదరాబాద్ నగరంలో మంచి ఫలితాలు సాధించేందుకు టీడీపీ నేతలు శక్తివంచన లేకుండా పోరాడారు. అయినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ఆంధ్రావాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్‌ఎస్‌ గెలిచింది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లకే పరిమితమైంది.

ఫలితం మరీ ఇంత దారుణంగా ఉం టుందని ఊహించని కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు లోపం ఎక్కడుందన్న దానిపై మథన పడుతున్నారు. తెలంగాణ ఇచ్చి నా కాంగ్రెస్‌ను నమ్మని ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేయకపోయినా టీఆర్‌ఎస్‌కు ఎందుకు పట్టం కడుతున్నారని బాధపడుతున్నారు.

గెలిపించకపోయినా, కనీసం ఆదరణైనా చూపించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందీ, అంతర్జా తీయ ఖ్యాతి తెచ్చిందీ కాంగ్రెస్సేననీ, తాము చేసిన అభివృ ద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేసినా గ్రేటర్‌ ఓటర్లు మాత్రం వాటికి ఆకర్షితులవలేదు.

 గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం

గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం


టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ‘‘వెయ్యి రూపాయల పింఛన, డబుల్‌ బెడ్‌రూం వంటి సంక్షేమ పథకాలు నిరుపేద వర్గాల్లో ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచాయి. టీఆర్‌ఎస్‌ ముందు జాగ్రత్తగా డివిజన్లను పునర్వ్యవస్థీకరించి ప్రతి డివిజన్లోనూ మురికివాడలకు చెందిన మెజారిటీ ఓటర్లు ఉండేలా చూసుకొంది. ఈ రకంగా పునర్వ్యవస్థీకరణ చేయకపోతే ఆ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదు'' అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.

 గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం

గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం


పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ఓటర్ల ఆలోచనాధోరణిలో వచ్చినమార్పు కూడా తమకు రాజకీయంగా నష్టం చేసిందన్న అభిప్రాయంలో టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాంత ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్‌ ఈసారి బాగా తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బయట కు వచ్చి ఓటు వేసిన వారు ఈ సారి ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదంటున్నారు.

 గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం

గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం


ఈ ఎన్నికల కసరత్తులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా ఈ ఫలితాలు బాగా నిరాశ కలిగించాయి. ‘‘అందరినీ సమన్వయపర్చడానికి లోకేశ తన వంతు ప్రయత్నం చేశారు. కానీ మా అందరి ప్రయత్నాలకు భిన్నమైన వాతావరణం నెలకొన్నప్పుడు ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఈసారి ఎన్నికల్లో పార్టీ తరపున ప్రయత్న లోపం లేదు. పరిస్థితులు అనుకూలించలేదు అంతే'' అని ఒక నాయకుడు అభిప్రాయపడ్డారు.

 గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం

గ్రేటర్ ఎన్నికలు: టీడీపీలో నిరాశ, నలిగిపోయిన హస్తం

గ్రేటర్ ఎన్నికల చివరిలో సీఎల్పీ నేత జానారెడ్డి రూ.5 భోజనం చేసి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం టీఆర్ఎస్‌కు కలిసొచ్చిందంటున్నారు. 2019 సాధారణ ఎన్నికలపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు.. త్వరగా తేరుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని, పార్టీ సమూల ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+