జిహెచ్ఎంసి ఎన్నికలు: మరో 20 మందితో టిఆర్ఎస్ జాబితా, కాంగ్రెసు తొలి విడత అభ్యర్థులు వీరే
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగియడానికి ఒక్క రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే పనిలో పడ్డాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ 20 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది.
తొలి జాబితాలో 60 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన విషయం విదితమే. తొలి, రెండో జాబితాతో కలిపి 80 మందికి చేరింది. మరో 70 మంది పేర్లు త్వరలోనే ప్రకటించనుంది టీఆర్‌ఎస్. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలావుంటే, టీఆర్‌ఎస్ శుక్రవారం 80 మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 45 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పించామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. త్వరలోనే మరోజాబితా విడుదల చేస్తామని తెలిపారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.

తార్నాక - బండ కార్తీకరెడ్డి
కూకట్‌పల్లి - కూన అమరేశ్ గౌడ్
హైదర్‌నగర్ - నక్కా శ్రీనివాస్
అల్విన్ కాలనీ - దాసరి నర్సింగ్ రావు
గాజులరామారం - సుంకరి సాయి ప్రతాప్
జగద్గిరిగుట్ట - అత్తారి మారయ్య
చింతల్ - బండి సుగుణ
సూరారం - అబ్దుల్ ఆరీఫ్
కుత్బుల్లాపూర - ఇందుకూరి సూర్యప్రభ
వినాయక్ నగర్ - కృష్ణవేణి
మల్కాజ్‌గిరి - జీడి శ్రీనివాస్‌గౌడ్
కాప్రా - గూడ ఇంద్రయ్య
హబ్సిగూడ - పసుల మంజుల
హయత్‌నగర్ - ఎం. చంద్రశేఖర్‌రావు
నాగోలు - పోలేపల్లి వనజ
దూద్‌బౌలి - మీరాజ్ మహ్మద్
మంగళ్‌హాట్ - సుబేదార్ అంజురాణి
దత్తాత్రేయనగర్ - మ్యాడం రమేశ్ కుమార్
షేక్‌పేట్ - ఆత్మకూరి సుధాకర్
భోలక్‌పూర్ - వాజిద్ హుస్సేన్
బౌద్ధనగర్ - అదెం ఉమాదేవి
మౌలాలి - పద్మావతీ యాదవ్
జీడిమెట్ల - పల్లవి
మచ్చ బొల్లారం - ఎంవీ సూర్యకిరణ్
సుభాష్‌నగర్ - ఆర్. లక్ష్మీదేవి
వినాయక్‌నగర్ - యం. కృష్ణవేణి
నేరేడ్‌మెట్ - మరియమ్మ
వివేకానందనగర్ - ఉప్పల విద్యాకల్పన
మాదాపూర్ - డి. నర్సింహ యాదవ్
శేరిలింగంపల్లి - కె. ఎల్లేష్
చందానగర్ - గంపల అనిత
రంగారెడ్డి నగర్ - కృష్ణ
కొండాపూర్ - ఉట్ల కృష్ణ
హఫీజ్‌పేట్ - లక్ష్మీగౌడ్
పఠాన్‌చెరు - మెట్టు శంకర్ యాదవ్
ఎర్రగడ్డ - నహషీన్ బేగం
వెంకటేశ్వర కాలనీ - భారతీ నాయక్
యూసుఫ్‌గూడ - అప్పల సురేందర్ యాదవ్
వెంగళ్‌రావునగర్ - డి. నాగార్జున రెడ్డి
రామాంతపూర్ - బండ చంద్రమ్మ
జాన్‌బాగ్ - విక్రం గౌడ్
బోరబండ - యు. పోచయ్య గౌడ్
సైదాబాద్ - కె. అరుణారెడ్డి












Click it and Unblock the Notifications