గ్రేటర్ ఎన్నిక: నారా లోకేష్ ఒత్తిడితో 'ఓటుకు నోటు' ప్రదీప్‌కు టిక్కెట్?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరైన ప్రదీప్ చౌదరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన వెంగళరావు నగర్ డివిజన్ నుంచి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ డివిజన్ నుంచి మరొకరికి టిక్కెట్ ఇవ్వాలని ఒత్తిడి రావడంతో పాటు ఈ స్థానం తమకు కేటాయించాలని బిజెపి సైతం ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఒత్తిడి ఫలించి.. చివరి క్షణంలో తన సన్నిహితుడు ప్రదీప్ చౌదరి పేరు ఖరారు చేశారని అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో లోకేష్ తన సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారని, అందుకు ప్రదీప్‌కు టిక్కెట్ రావడం కారణంగా చెబుతున్నారు. గత ఏడాది ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ఈ వ్యవహారంలో కాల్ లిస్ట్ ఆదారంగా ప్రదీప్ నెంబర్ నుంచి పలుమార్లు ఫోన్ సంభాషణలు ఉన్నందున ఆయనను విచారించారు.

స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్
ఐటీ రంగంలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని మంత్రి కెటి రామారావు అన్నారు. సోమవారం నాడు గచ్చిబౌలీలోని టీ హబ్‌లో జరిగిన కార్యాక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నాస్కామ్‌తో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్బంగా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్‌ను స్టార్టప్ రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ఐటీ, స్టార్టప్ పాలసీని తీసుకొస్తామన్నారు. నాస్కామ్‌తో ఒప్పందం వల్ల యువతకు పుష్కలంగా అవకాశాలు వస్తాయని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications