వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్ల వెడల్పుకు జీహెచ్ఎంసీ శ్రీకారం.!మూడవ స్టాండింగ్ కమిటీలో కీలక నిర్ణయాలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జిహెచ్ఎంసి మూడవ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. లింక్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి జోన్ లో ఆరు నుండి ఏడు జంక్షన్లను అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారని, అంతేకాకుండా పారిశుధ్య కార్మికుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కమిషనర్ కు కూడా ఆదేశాలు జారీ చేసారని కోరారని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేసారు.

 మౌళిక సదుపాయాల కల్పనలో జీహెచ్ఎంసీ దూకుడు.. 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 40 కీలక నిర్ణయాలు

మౌళిక సదుపాయాల కల్పనలో జీహెచ్ఎంసీ దూకుడు.. 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 40 కీలక నిర్ణయాలు

మరో సి అండ్ డి ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను త్వరలో పిలువనున్నట్లు తెలిపారుకమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్. ప్రతి సి అండ్ డి ప్లాంట్ వద్ద ఎలక్ట్రానిక్ వే - బ్రిడ్జిమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ పరిశీలన చేసి సర్టిఫికెట్ జారీ చేస్తుందనిఅన్నారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇ.సి.ఎల్ నుండి బోడుప్పల్ వయా ఎన్.ఎఫ్.సి వరకు లింక్ రోడ్డు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 రోడ్ల వెడల్పుకు ప్రాముఖ్యత.. ఆస్తుల సేకరణపై సంస్థ దృష్టి

రోడ్ల వెడల్పుకు ప్రాముఖ్యత.. ఆస్తుల సేకరణపై సంస్థ దృష్టి


మోడల్ గ్రేవ్ యార్డ్ వెనుక భాగంలో ఇరుకుగా ఉన్న రోడ్డునువెడల్పు కు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నరికిన చెట్లనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.మిర్జా ముస్తఫా బేగ్మాట్లాడుతూ, బాలాపూర్ నుండి బండ్లగూడ 60 ఫీట్ల రోడ్డును డెవలప్ చేయాలని, సి అండ్ డి కలెక్షన్ మరో 15 సర్కిళ్లలో సేకరణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కుర్మ హేమలత మాట్లాడుతూ, తమ డివిజన్ లో మోడల్ గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని కోరారు. సి.ఎన్ రెడ్డి మాట్లాడుతూ, యూసుఫ్ గూడ నుండి రహమత్ నగర్ వరకు రోడ్డు వెడల్పుకు ఆస్తుల సేకరణ పూర్తి చేయాలని కోరారు.

 సిటీలో ఎక్కడా వాహనాల రద్దీ ఉండకూడదు.. పక్కా ప్రణాళిక రచిస్తున్న జీహెచ్ఎంసీ

సిటీలో ఎక్కడా వాహనాల రద్దీ ఉండకూడదు.. పక్కా ప్రణాళిక రచిస్తున్న జీహెచ్ఎంసీ

షేక్ పేట్ రషీద్ ఫరాజుద్దీన్ మాట్లాడుతూ, షేక్ పేట్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డులోభూసేకరణ నిలిచి పోయినందునఅక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తగులుతున్నాయని, విద్యుత్ శాఖ వారు కొమ్మలను నరికివేసి వెంటనే తొలగించడం లేదని, వెంటనే తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని మందాడి స్వామి కోరారు. కె.పి.హెచ్.బి కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రపోజల్ చేసేటప్పుడు లోకల్ కార్పొరేటర్ ను సంప్రదించే విధంగా చూడాలని డివిజన్ లో గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

 ఇరుకురోడ్లు ఉండకూడదు.. రోడ్ల వెడల్పుకు శ్రీకారం చుట్టిన నగరపాలక సంస్థ

ఇరుకురోడ్లు ఉండకూడదు.. రోడ్ల వెడల్పుకు శ్రీకారం చుట్టిన నగరపాలక సంస్థ

స్టాండింగ్ కమిటీ సమావేశంలో 40 అంశాలను ఆమోదించినట్టు మేయర్ స్పష్టం చేసారు. తీగల కుంట క్రాస్ రోడ్స్ నుండి తాడ్ బండ్ లేబర్ అడ్డా వయా ఇర్ఫాన్ హోటల్ నవాబ్ సాహెబ్ కుంట వరకు లిక్ రోడ్డు వెడల్పు 228 ఆస్తుల సేకరణ కోసం ప్రభుత్వ ప్రతిపాదనలు పంపుటకు ఆమోదం తెలిపిందని తెలిపారు.
ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మి, అడిషనల్ కమిషనర్లుబి.సంతోష్, వి.క్రిష్ణ, జోనల్కమిషనర్లుప్రియాంక అలా, శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్, అశోక్ సామ్రాట్, పంకజ, మమత తదితరులు పాల్గొన్నారు.

English summary
The GHMC Third Standing Committee meeting was chaired by Mayor Gadwal Vijayalakshmi on Wednesday. It seems that priority has been given to the development of link roads and junctions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X