కాళ్లూ, చేతులూ కట్టేసి యువతి దారుణ హత్య, రేప్?: హంతకుడి అరెస్ట్
హైదరాబాద్: గండిపేట శివారులోని ఓ ఫాం హౌజ్ సమీపంలో ఆదివారం దారుణహత్యకు గురైన యువతి కేసును నార్సింగి పోలీసులు 24గంటల్లోనే చేధించారు. మృతురాలిని పాతబస్తీకి చెందిన యువతి అమీనాగా గుర్తించారు. ఆమెను హత్య చేసిన పాతబస్తీకి చెందిన అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను అమీనా ఇంట్లో దొంగతనం చేస్తుండగా చూసినందుకే అమీనాను హత్య చేసినట్లు అక్బర్ పోలీసులు ముందు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది.
నాలుగు తులాల బంగారు, రూ. 7వేలను దొంగతనం చేసినట్లు నిందితుడు తెలిపినట్లు సమాచారం. గంటిపేట ను చూపిస్తానంటూ అమనాను తీసుకెళ్లి.. అక్కడే కాళ్లూ, చేతులూ కట్టేసి హత్య చేిసనట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది.

బైక్ పై తీసుకెళ్లాడు
యువతి గొంతు కోసి.. బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేయడంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారింది. మృతురాలికి అక్బర్‌కు గతంలో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పరిచయంతోనే ఆమె అక్బర్ బైక్‌పై వెళ్లినట్లు తెలుస్తోంది.

నిందితుడితో బాధితురాలు
మరోవైపు తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గండిపేట పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని కనుగొన్నారు.

ఎందుకు వెళ్లింది
వీరు ఇంత మారుమూల ప్రాంతానికి రావాల్సిన అవసరం ఏమిటి, అక్బర్ ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? ఈ ఘటనలో అక్బర్ ఒక్కడే పాల్గొన్నాడా? లేదా మరొకరెవరైనా అతడికి సహాయం చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు ముందు యువతిపై అత్యాచారం చేశారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

యువతి మృతదేహం
మృతురాలు ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. కూతురు హత్య గురైందన్న సమాచారంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications