స్కూల్లో గోడకుర్చీ వేయించి చిన్నారిని చంపేశారు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో వేసిన శిక్ష కారణంగా ఐదో తరగతి చదువుతున్న అశ్విత అనే చిన్నారి అస్వస్థతకు గురై మృత్యువాత పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది.
దారుణమైన సంఘటనను నిరసిస్తూ అశ్విత తల్లిదండ్రులతో పాటు స్థానికులు పాఠశాల వద్ద గురవారం ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హోం వర్క్ చేయలేదనే కారణంతో వరుసగా ఐదు రోజుల పాటు అశ్వితను పాఠశాలలో గోడ కుర్చీ వేయించారు. దాంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.

రెండు రోజుల క్రితం అశ్వితను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. లెక్కలకు సంబంధించిన హోం వర్క్ చేయలేదని తెలుస్తోంది. అయితే, హోం వర్క్ చేయలేదనే కారణంతో పాఠశాలలో శిక్ష వేయడం సాధారణమేనని అనుకున్న తల్లిదండ్రులు తొలుత సంఘటనను తేలికగా తీసుకున్నారని తెలుస్తోంది.
గోడకుర్చీ వేయించడం వల్లనే అశ్విత మరణించిందనే కారణంతో పాప బంధువులు వివేరవర్థిని పాఠశాల వద్ద ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications