ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య
మహబూబ్ నగర్: ప్రియుడి మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ పట్టణానికి చెందిన మల్లప్ప కుమారుడు రమేశ్ అలియాస్ కన్నయ్య (22), అర్చన గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వారి వివాహనికి అంగీకరించి ఈ నెల 2న పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లికి ఒక రోజు ముందు రమేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రమేశ్ కుటుంబ సభ్యులు అమ్మాయి తరపు వారే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో అర్చనను వారి తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం అక్కంపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. రమేశ్ మృతిని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురైన అర్చన శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. బంధువులు తాండూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.












Click it and Unblock the Notifications